Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేటి నుంచి పల్నాటి వీరారాధన ఉత్సవాలు

కారంపూడి, డిసెంబరు 2: పల్నాటి వీరారాధన ఉత్సవాలకు సర్వం సిద్ధంచేశామని పీఠాధిపతి పిడుగు తరుణ్‌ చెన్నకేశవ అయ్యవారు, ఎంపీడీవో బాలునాయక్‌లు తెలిపారు. శుక్రవారం నుంచి ఐదురోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి. 3వ తేదీన రాచగావు, 4న రాయభారం, 5న మందపోరు, 6న కోడిపోరు, 7న కల్లిపాడుతో ఉత్సవాలు ముగుస్తాయి. తెలుగురాష్ట్రాల్లోని వీరాచారవంతులు తమ పూర్వీకుల ఆయుధాలతో కారంపూడికి విచ్చేశారు. కరోనా నిబంధనల మేరకు ఉత్సవాలు జరుపుతామని పీఠాధిపతి పిడుగు తరుణ్‌చెన్నకేశవ అయ్యవారు తెలిపారు. గురువారం వీర్లదేవాలయ ప్రాంగణాన్ని పీఠాధిపతి, ఎంపీడీవో పరిశీలించారు. పారిశుధ్యలోపం లేకుండా పంచాయతీసిబ్బందితో శుభ్రంచేయించారు. నాగులేటి ఘట్టాలను పరిశీలించారు. వీరాచారవంతులు తమ పూర్వీకుల ఆయుధాలను తీసుకొని గంగధారమడుగులో స్నానం ఆచరింపజేసేందుకు వీలుగా ఉందో లేదోనని పరిశీలించారు. మహిళల స్నానాలకు ప్రత్యేక గదులు ఏర్పాటుచేయించారు. వీరారాధన ఉత్సవాల సందర్భంగా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్‌ఐ బాలకృష్ణ పేర్కొన్నారు. 

నేటి నుంచి ఎడ్ల పోటీలు

పల్నాటి వీరారాధన ఉత్సవాల సందర్భంగా శుక్రవారం నుంచి ఏడు రోజులు తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఎడ్ల విభాగాల్లో బండలాగుడు పోటీలు నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకుడు బొమ్మిన అల్లయ్య మాట్లాడుతూ శుక్రవారం ఉదయం వీర్ల దేవాలయ సరిహద్దుల్లో ఎమ్మెల్యే పోటీలను ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ షేక్‌ షఫి, ఎంపీపీ మేకల శారదాశ్రీనివాసరెడ్డి, సర్పంచ్‌ ప్రమీలా తేజానాయక్‌, మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు అనంతలక్ష్మి, కోఆప్షన్‌ సభ్యుడు ఎ.ఏసోబు, ఎంపీటీసీ షేక్‌ ఆరీఫ్‌, ఉపసర్పంచ్‌ సూరె అంకారావు, పాతూరి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement