Advertisement
Advertisement
Abn logo
Advertisement

వెంకయ్య స్వామి ఆశ్రమంలో ‘కన్నా’ పూజలు

వెంకటాచలం, డిసెంబరు 1 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన గొలగమూడి భగవాన్‌ శ్రీవెంకయ్య స్వామి ఆశ్రమాన్ని బుధవారం బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆశ్రమ సంప్రదాయ ప్రకారం ఈవో బాలసుబ్రహ్మణ్యం శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం కుటుంబ సభ్యుల పేరిట ఆశ్రమ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట బీజేపీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు భరత్‌కుమార్‌, బీజేపీ మండలాధ్యక్షుడు కుంచి శ్రీనివాసులుయాదవ్‌, నాయకులు అసనాపురం శ్రీనివాసులు, ఎం.సురేష్‌, ఎం.ఈశ్వరయ్య, పిల్లిపాకుల పెంచలయ్య, సండిబోయిన శ్రీనివాసులు, గోత్తల నరేష్‌ తదితరులున్నారు.  


అమరావతి రైతులకు బీజేపీ సంఘీభావం 

అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం టూ దేవస్థానం మహాపాదయాత్రకు బుధవారం బీజేపీ జిల్లా నేతలతో కలిసి పొదలకూరులో అమరావతి రైతులకు మండల బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారు.   సంఘీభావం తెలిపిన వారిలో బీజేపీ రాష్ట్ర ముఖ్య నాయకుడు సురేష్‌రెడ్డి,  మండలాధ్యక్షుడు కుంచి శ్రీనివాసులు యాదవ్‌, బీజేపీ జిల్లా కార్యదర్శి అల్లూరు ప్రసాద్‌నాయుడు, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి ఆరుముళ్ల మురళీ, కిసాన్‌మోర్చ మండలాధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement