Jun 12 2021 @ 17:52PM

'నారప్ప' స్పెషల్ కేర్ తీసుకుంటున్న వెంకీ..!

'నారప్ప' స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట వెంకటేశ్. ప్రియమణి ఆయన సరసన నటిస్తోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమిళ హిట్ సినిమా 'అసురన్' రీమేక్‌గా 'నారప్ప' తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా విషయంలో వెంకీ చాలా కేర్ తీసుకుంటున్నాడట. అనంతపురం నేపథ్యంలో నారప్ప సినిమాను తెరకెక్కించారు. అందుకే అక్కడి భాషా, యాస అన్ని పర్‌ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా నారప్ప సీమ యాస కోసం ఓ శిక్షకుడిని కూడా పెట్టుకున్నట్లు సమాచారం. వెంకీకి రీమేక్ సినిమాలు బాగా కలిసి వస్తాయి. ఆయనకు హిట్స్ ఇచ్చిన వాటిలో ఎక్కువగా రీమేక్ చిత్రాలుండటం విశేషం. ఇక ఈ సినిమాను సురేష్ బాబు - కలైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనితో పాటు 'ఎఫ్3', 'దృశ్యం 2' వెంకీ నుంచి రాబోతున్నాయి.