Advertisement
Advertisement
Abn logo
Advertisement

పాపం.. కొత్త స్కూటీ కొనుకున్న అమ్మాయికి వింత కష్టం.. నెంబర్ ప్లేట్ మీద ఆ పదం వల్ల బయట తిరగలేని పరిస్థితి..

కొత్త స్కూటీ కొనుక్కొని బయట తిరుగుదామనుకున్న ఆ అమ్మాయికి వింత కష్టం ఎదురైంది. నెంబర్ ప్లేట్ మీద SEX అని ఉండడంతో ఆ అమ్మాయి గతుక్కుమంది. బయట తిరగడానికి నానా ఇబ్బందులు పడుతోంది. ఢిల్లీకి చెందిన ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్‌కు ఈ సమస్య ఎదురైంది. రోజూ బస్సులో ప్రయాణం చేయలేక ఓ బైక్ కొనమని ఆమె తన తండ్రిని ఎప్పట్నుంచో అడుగుతోంది. ఎట్టకేలకు ఆమె తండ్రి దీపావళి కానుకుగా ఇటీవల ఆమెకు బైక్ కొనిచ్చాడు.  


ఆర్టీవో ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ తర్వాత ఆమె స్కూటీకి సీక్వెన్స్ ప్రకారం నెంబర్ ప్లేట్ వచ్చింది. సాధారణంగా బైక్‌ నెంబర్ ప్లేట్‌పై నెంబర్‌తో పాటు ఆ వాహనం ఏ రాష్ట్రానికి, ఏ జిల్లాకు, ఏ ప్రాంతానికి చెందినదో సూచిస్తూ ఆంగ్లంలో అక్షరాలు కూడా ఉంటాయి. ఆ యువతికి వచ్చిన నంబర్ ప్లేట్‌‌పై `DL3 SEX` అనే అక్షరాలు ఉన్నాయి. అవే ఆమెకు ఊహించని చిక్కులు తెచ్చిపెట్టాయి. స్కూటీ మీద ఆ పదాలను చూసి ఇరుగుపొరుగు వారు ఆ యువతిని ఏడిపించడం ప్రారంభించారు. దీంతో ఆ యువతి తండ్రి ఆర్టీవో ఆఫీస్‌కు వెళ్లి నెంబర్ మార్చమని అడిగాడు. అయితే ఢిల్లీలో `SEX` పేరుతో చాలా కార్లు, బైక్‌లకు నెంబర్ ప్లేట్‌లను ఇచ్చామని, ఇప్పుడు మార్చడం కుదరదని అట్నుంచి సమాచారం రావడంతో వారు అవాక్కయ్యారు. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement