Abn logo
Jul 11 2020 @ 05:25AM

కొవిడ్‌ నిబంధనలతో వాహనాలు నడపాలి

తడ,  జూలై 10 : కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలని సూళ్లూరుపేట రవాణాశాఖ ప్రాంతీయ కార్యాలయం అధికారి రఫీ తెలిపారు. శుక్రవారం సాయంత్రం మాంబట్టు సెజ్‌ రోడ్డు వద్ద వివిధ పరిశ్రమల కార్మికులను తరలించే బస్సులను నిలిపి బస్సు సిబ్బందికి,  కార్మికులకు, ఉద్యోగస్థులకు కొవిడ్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు. బస్సులో డ్రైవర్‌ సహా అందరూ మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటించాలని తెలిపారు. నిబఽంధనలను అతిక్రమిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement