Abn logo
Jul 9 2020 @ 05:31AM

ఠాణా ఆవరణలో కూరగాయల సాగు

పెద్దమందడి, జూలై 8:  స్థానిక పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది వినూత్నంగా ఠాణా ఆవరణలో సేంద్రియ పద్దతుల ద్వారా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, కంది పంటను సాగుచేస్తున్నారు. హరితహారంలో భాగంగా పెద్ద మొత్తంలో మొక్కలు కూడా నాటుతున్నారు. రసాయన ఎరువులతో పండించిన కూరగాయల వల్ల అనారోగ్యం, మానసిక ఒత్తిడి తగ్గించుకో వాలని ఎస్సై రాము వినూత్న ఆలోచనతో పోలీస్‌ స్టేషన్‌ వెనక వైపు ఖాళీగా ఉన్న సుమారు రెండు ఎకరాల స్థలంలో సేంద్రియ పద్దతులతో ఆకూ కూరలైన పాలకూర, బచ్చలికూర, గోంగూర, మెంతెంకూర, తోట కూర, పుదీనా, కొత్తిమీర, కూరగాయలు టమాటా, వంకాయ, బెండకాయ, బీరకాయ, సోరకాయ, కీరదోస, దొండకాయ, పచ్చి మిరపకాలతో పాటు పండ్ల మొక్కలు అరటి, నేరేడు, జామ, దానిమ్మ, బొప్పాయి, మామిడి, సపోటలను సాగు చేస్తున్నారు.


లాక్‌డౌన్‌ సమయంలో కూరగాయలు సాగు చేయడం సత్పలితాలు ఇవ్వడం తోటలో కొంతసేపు పని చేయ డంతో మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభించడంతో మిగతా ఖాళీ స్థ లాన్ని విధినిర్వహణలో తలమున్నకలై ఉండే సిబ్బంది సమయం దొరికి నప్పుడల్లా తోటలోకి వెళ్లి కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి సారిస్తూ మంచి ఫలితాలను పొందుతున్నారు. సిబ్బంది వంటకు సరిపోను మిగి లిన కూరగాయాలను తమ ఇంటికి, ఇంకా స్టేషన్‌కు వచ్చే వారికి ఉచి తంగా పంపిణీ చేస్తున్నారు. స్టేషన్‌కు వచ్చే వారికి కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా సేంద్రియ పద్దతులలో కూరగాయల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు.  సేంద్రియ పద్దతిలో సాగుచేసిన కూరగా యలతో ఆరోగ్యంగా ఉంటామని ఎస్సై రాము అన్నారు. 

Advertisement
Advertisement