Abn logo
Apr 4 2020 @ 11:26AM

వ‌రుణ్‌తో మూడోసారి జోడీ క‌డుతున్న హీరోయిన్‌..?

వ‌రుణ్‌తేజ్ పెద్ద‌గా అవ‌కాశాలు లేని అమ్మ‌డుని ఎంక‌రేజ్ చేస్తున్నాడా? అంటే అవున‌నే గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి. ఓ హీరోయిన్ వ‌రుణ్ తేజ్‌తో మూడోసారి క‌లిసి న‌టించ‌బోతుంద‌ట‌. ఇంత‌కు ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు.. లావ‌ణ్య త్రిపాఠి. ఇది వ‌ర‌కు వీరిద్ద‌రూ మిస్ట‌ర్‌, అంత‌రిక్షం సినిమాల్లో క‌లిసి న‌టించారు. తాజాగా మ‌రోసారి ఈ జోడీ వెండితెర‌పై సంద‌డి చేయ‌బోతున్నార‌ట‌. వివ‌రాల్లోకెళ్తే.. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా బాక్సింగ్ నేప‌థ్యంలో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఇప్ప‌టికే బాలీవుడ్ హీరోయిన్ స‌యీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌రో హీరోయిన్ పాత్ర‌లో లావ‌ణ్య క‌నిపిస్తుంద‌ని స‌మాచారం. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisement
Advertisement
Advertisement