Advertisement
Advertisement
Abn logo
Advertisement

దళితులను అన్ని విధాల వంచించారు: వర్ల రామయ్య

అమరావతి: సీఎం జగన్ రెండున్నరేళ్ల పాలనపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సీఎస్‌ సమీర్ శర్మకు లేఖ రాశారు. రెండున్నరేళ్ల పాలనలో ముఖ్యమంత్రి దళితులను అన్ని విధాల వంచించారన్నారు. 30 నెలల పాలనలో 29 ఎస్సీ, ఎస్టీ పథకాలను రద్దుచేసి రూ.26,663 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్ళించారన్నారు. ఆ నిధులను తిరిగి ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినా చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లే అయ్యిందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 12 వేల ఎకరాల అసైన్డ్ భూములను అన్యాయంగా ప్రభుత్వం లాక్కుందని వర్ల రామయ్య ఆ లేఖలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement