Abn logo
Dec 2 2020 @ 15:06PM

ఎమ్మెల్యే ఆరోగ్యానికే దిక్కులేకపోతే, సామాన్యుని గతేంటి?: వర్ల

అమరావతి: తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య జగన్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘శాసనసభలో అనర్గళంగా ఉపన్యసించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావుకు కరోనా అట, బాగుంది ముఖ్యమంత్రి గారూ, రాష్ట్రంలో కరోనా సోకకుండా మీ ప్రభుత్వం తీసుకునే జాగ్రత్తలు, శాసనసభలో ఎమ్మెల్యే ఆరోగ్యానికే దిక్కులేకపోతే, సామాన్యుని గతేంటి?, మీ ప్రభుత్వ పని తీరుకు ఇదో ప్రబల నిదర్శనం, ప్రజారోగ్యం కాపాడు దేవుడా!’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Advertisement
Advertisement