Advertisement
Advertisement
Abn logo
Advertisement

సబ్సిడీపై వరి విత్తనాల పంపిణీ

కోట, డిసెంబరు 7 : మండల పరిధిలోని కొత్తపట్టణం పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లోని రైతులకు మంగళవారం  80శాతం సబ్సిడీపై వరి విత్తనాల పంపిణీ జరిగింది. గోవిందుపల్లి, వావిళ్లదొరువు, శ్రీనివాసాపురం, కొత్తపట్నం,  యమదిన్నెపాళెం, గున్నంపడియ గ్రామాల లో వరి పంటలు నీటమునిగి దెబ్బతిన్నాయి. దీంతో ప్రభుత్వం మంజూరు చేసిన సబ్సిడీ వరి విత్తనాలను మాజీ జడ్పీటీసీ ప్రసాద్‌గౌడ్‌తోపాటు సర్పంచు తిరుపాలయ్య, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు శేషయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద పారిశుధ్య కార్యక్రమాలు జరిగాయి. 


Advertisement
Advertisement