Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రతి కుటుంబానికి 50వేలు పరిహారం ఇవ్వాలి

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు


బుచ్చిరెడ్డిపాళెం, నవంబరు 26: పెన్నానది వరద ముప్పుకు గురైన ప్రతి కుటుంబానికి రూ.50వేలు పరిహారం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుబల్లి మధు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన పెన్నా వరద ముంపునకు గురైన  పెనుబల్లి, కాగులపాడు, దామరమడుగు గ్రామాలను పరిశీలించి, తీవ్రంగా నష్టపోయిన బాధితులను పరామర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టి తక్షణ సహాయం కింద రూ.10వేలు అందించాలన్నారు. వరదల్లో నష్టపోయిన ప్రతి రైతుకు ఆర్థిక సాయం, చేపలు, రొయ్యల గుంటలు రైతులను ఆదుకునేందుకు బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట సీపీఎం జిల్లా, మండల నాయకులు మూలం రమేష్‌, ఎం. మోహన్‌రావు, వెంకమరాజు, ముత్యాల గుర్నాధం, గండవరపు శ్రీనివాసులు, సురేష్‌, మాధవ్‌,  మల్లికార్జున, శ్రీనివాసులు, కృష్ణ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement