పెద్దదర్గాను దర్శించుకున్న శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు
రాజంపేట టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి
ఒంటిమిట్ట, డిసెంబరు1 : వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని రాజంపేట టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఒంటిమిట్ట రామాలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీరికి టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ప్రజలు వరదలతో నష్టపోయి ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి గాలిలోనైనా జిల్లాను సందర్శించలేదని ఆయన అన్నారు. వయస్సు తేడా లేకుండా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడిని హేళనగా మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. జిల్లాలో వరదల ధాటికి చేనేత కార్మికులు, రైతులు నష్టపోయారని వారిని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు వెంకటనరసయ్య, అడ్వకేటు ఆదినారాయణ, నాగమునిరెడ్డి, శ్రీహరి, వెంకటయ్య, సుబ్బారెడ్డి, హరినాధరెడ్డి, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
పెద్దదర్గాను సందర్శించిన శ్రీనివాసరెడ్డి
కడప, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కడప అమీన్‌పీర్ పెద్దదర్గాను మంగళవారం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు) కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్గా కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగత ం పలికారు. ఈ సందర్భంగా వాసు కుటుంబ సభ్యులు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడకుండా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆయన అల్లా్‌హను వేడుకున్నారు.