Abn logo
May 23 2020 @ 11:31AM

సినీ నటి వాణిశ్రీ కుమారుడు మృతి

చెన్నై: టాలీవుడ్ సీనియర్ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమారుడు అభినయ్ వెంకటేశ్ నిన్న ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఊటీలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న ఆయన.. ప్యాలెస్ పనుల నిమిత్తం చెంగల్‌పట్టుకు వెళ్లారు. ఆ రాత్రి తన కుమారుడితో సరదగా గడిపిన వెంకటేశ్.. ఉదయం విగతజీవుడిగా మారారని సన్నిహితులు తెలిపారు. నిద్రలో గుండెపోటు రావడంతో చనిపోయాడని చెబుతున్నారు. అయితే ఆత్మహత్యగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


అభినయ్ మృతదేహాన్ని చెన్నైలోని వాణిశ్రీ ఇంటికి తీసుకురావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అభినయ్ సతీమణి కూడా వైద్యురాలేనని సన్నిహితులు తెలిపారు. సావిత్రి మనవరాలి ఆసుపత్రిలో ఆమె పని చేస్తోందన్నారు. అభినయ్ అంత్యక్రియలు ఇవాళ జరుగుతాయని చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అభినయ్ మృతితో చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. వాణిశ్రీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. వాణిశ్రీకి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. 

Advertisement
Advertisement
Advertisement