Abn logo
May 22 2020 @ 07:51AM

వందే భారత్‌ మిషన్‌ రెండో దశ పొడిగింపు

న్యూఢిల్లీ మే 21: ఈ నెల 22న ముగియవలసిన  వందే భారత్‌ మిషన్‌ రెండో దశను జూన్‌ 13 వరకు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ దశలో 47 దేశాల్లోని భారతీయులను 162 విమానాల ద్వారా స్వదేశానికి తీసుకువస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ తెలిపారు. అమెరికా, యూరప్‌ ఖండాలకు విమానాల సంఖ్యను కూడా పెంచనున్నట్లు చెప్పారు.  జూన్‌ 13 తరువాత ఈ మిషన్‌ మూడో దశలో ప్రైవేట్‌ విమాన సంస్థలకు కూడా భాగస్వామ్యం కల్పిస్తామన్నారు. ఈ నెల 7న మొదలైన ఈ మిషన్‌ ద్వారా ఇప్పటి వరకు 23,475 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చారు.


Advertisement
Advertisement
Advertisement