Abn logo

వాము చారు

కావలసిన పదార్థాలు: వాము - 1 టీ స్పూను, ఎండుమిర్చి - 4, ధనియాలు - ఒక టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, నూనె - ఒక టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, వెల్లుల్లి రెబ్బలు - 4, పచ్చిమర్చి - 2, చింతపండు రసం - 250 మి.లీ., పసుపు - అర టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, కరివేపాకు - 4 రెబ్బలు.


తయారుచేసే విధానం: వాము, 2 ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేగించి పొడి చేయాలి. కడాయిలో నూనె వేసి మెంతులు, ఆవాలు, వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేగించి చింతపండు రసం పోయాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసి మరిగించి వాము పొడి మిశ్రమం కలపాలి. మరో రెండు నిమిషాల తర్వాత దించేసి సర్వ్‌ చేయాలి.

మెంతి పులుసుకొబ్బరిపాల రసంకల్యాణ రసంపచ్చి మామిడి రసంబెండ పెరుగుఅలసంద సాంబారువంకాయ పచ్చి పులుసుఉలవ చారుమునగాకు రసంములక్కాడ రొయ్య పులుసు
Advertisement
Advertisement