Sep 21 2021 @ 13:32PM

'వలిమై': కార్తికేయ లుక్ విడుదల

తమిళ స్టార్ అజిత్ కుమార్ హీరోగా హెచ్. వినోత్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'వాలిమై'. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో గుమ్మకొండ కార్తికేయ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. నేడు (సెప్టెంబర్ 21) కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా 'వాలిమై' టీమ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా కార్తికేయకి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో కార్తికేయ చాలా పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. అజిత్‌కి సరిగ్గా సరిపోయో విలన్ అని పోస్టర్ చూసి చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషి అజిత్ సరసన నటిస్తుండగా, అగ్ర నిర్మాత బోని కపూర్ - జీ స్టూడియోస్ పతాకంపై ఈ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో 'వాలిమై' చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. కాగా, ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, ఫస్ట్ సింగిల్ మూవీపై భారీ అంచనాలు పెంచాయి.