Abn logo
May 21 2020 @ 00:42AM

వలసోపాఖ్యానం

కారణమేదైనా... కార్యమేదైనా

వలసే మనిషికి శ్వాస

అంతర్గతమో, అంతర్జాతీయమో

అస్తిత్వం ప్రశ్నార్థకమయితే

వలసలు సజీవమవుతాయి


స్థిరజీవితమొక రంగుల కల

అస్థిరజీవితం ఓ పీడకల

బతుకు సమరం కొందరిది

డాలర్‌ ఆత్రం మరికొందరిది


ఉపాధి వెదుకులాటలో

వలస ప్రాణుల వెతలెన్నో

క్షుద్భాదల కథలెన్నో

పాలకుల దుశ్చర్యలూ

దాష్టీకాలూ మరెన్నెన్నో


ఉపద్రవాలు, సంక్షోభాలు

కాటేసేదీ, కన్నెర్ర చేసేదీ

స్థానబలిమిలేని శ్రమజీవులనే

యూజ్‌ ఆండ్‌ త్రో సిద్ధాంతం

అనాదిగా ఎదుర్కొంటున్నదే. 


మార్గమంతా కాశీమజిలీ కష్టాలే

గమ్యం చేరినా ఆనందం ఆవిరే

శ్రమదోపిడీ ఆగుతుందా?

అభద్రతాభావం తొలగుతుందా?

కంచర్ల విజయభాస్కర్‌ 

కావలి, నెల్లూరు జిల్లా

Advertisement
Advertisement
Advertisement