Abn logo
Mar 29 2020 @ 11:07AM

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్న ‘వ‌కీల్‌సాబ్‌’

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత బాలీవుడ్ ‘పింక్’ చిత్రాన్ని ‘వ‌కీల్‌సాబ్‌’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, బోనీక‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. మిగ‌తా షూటింగ్ పూర్తి చేసే లోపు క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో సినిమా ఆగింది. సినిమాను మే 15న విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు.  క‌రోనా వైర‌స్ వ‌ల్ల వ‌చ్చిన ఈ గ్యాప్‌ను ‘వ‌కీల్‌సాబ్’ టీమ్ ఉప‌యోగించుకుంటుందట‌. ముఖ్యంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇప్ప‌టి వ‌ర‌కు పూర్త‌యిన సినిమా ఎడిటింగ్ చూసి డ‌బ్బింగ్ చెబుతున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో స‌మాచారం. ఇలా చేస్తేనే లాక్ డౌన్ ఎత్తివేయ‌గానే మిగిలిన పార్ట్‌ను త్వ‌ర త్వ‌ర‌గా పూర్తి చేసి అనుకున్న టైమ్‌లో విడుద‌ల చేసే అవ‌కాశం ఉంటుంద‌ని యూనిట్  భావిస్తుంద‌ట‌.

Advertisement
Advertisement
Advertisement