Abn logo
Mar 6 2021 @ 20:38PM

100 కోట్ల క్లబ్‌లో వైష్ణవ్‌ ‘ఉప్పెన’

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ కృతి శెట్టి హీరోయిన్‌గా.. నవ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'ఉప్పెన'. ఫిబ్రవరి 12న వరల్డ్ వైడ్‌గా అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టుకొని యునానిమస్ హిట్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ.. ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిందీ చిత్రం. ఈ చిత్రం వందకోట్ల క్లబ్‌లో చేరినట్లుగా స్వయంగా నిర్మాతలే తాజాగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. 

వాస్తవానికి ఈ మూవీ విడుదలకు ముందు జరిగిన ఓ ఈవెంట్‌లో క్రియేటివ్‌ దర్శకుడు సుకుమార్‌.. ఈ చిత్రం 100 కోట్ల చిత్రమని ప్రకటించారు. ఆయన మాటలను నిజం చేస్తూ.. ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లను సాధించినట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఒక డెబ్యూ హీరోతో 100 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టడమంటే మాములు విషయం కాదు. ఈ చిత్రానికి అన్నీ అలా కలిసి వచ్చాయి. కథ, కథనం, హీరో, విలన్‌, హీరోయిన్‌, నిర్మాతలు, దర్శకుడు.. ఇలా ఒక్కటేమిటి.. ప్రతీది ఈ చిత్రానికి ప్లస్‌ పాయింట్సే అయ్యాయి. అందుకే ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలిచిపోతుందని మెగాస్టార్‌ కూడా అన్నారు. ప్రస్తుతం చిత్రయూనిట్‌ వదిలిన 100 కోట్ల పోస్టర్‌ సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ని క్రియేట్‌ చేస్తోంది.

Advertisement
Advertisement
Advertisement