Abn logo
Jan 17 2021 @ 20:13PM

వ్యాక్సిన్‌లో సాతాన్.. క్రిస్టియన్ కార్డినల్ పోస్టు వైరల్!

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారిని ఓడించేందుకు వ్యాక్సిన్ మార్గాన్ని ఎంచుకుంటోంది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్లు వేసుకోవాలని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇలాంటి సమయంలో మెక్సికోకు చెందిన ఓ క్రిస్టియన్ మాజీ కార్డినల్ పెట్టిన ఫేస్‌బుక్ పోస్టు వివాదాస్పదం అయ్యింది. తన పోస్టులో వ్యాక్సిన్‌పై భయంకరమైన వ్యాఖ్యలు చేశాడీ మాజీ కార్డినల్. ఆయన పేరు జువాన్ శాండోవల్ ఇనిగువెజ్. కరోనాను నియంత్రించడానికి అందరూ వేసుకుంటున్న వ్యాక్సిన్‌లో సాతాన్‌కు చెందిన ఓ చిప్ ఉందని జువాన్ పేర్కొన్నాడు.


‘‘వ్యాక్సిన్‌లో ఈ చిప్ ద్వారా మనల్ని నియంత్రించేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు. గుర్తుంచుకోండి.. ఈ వ్యాక్సిన్ రాక్షసుల గుర్తు’’ అంటూ వీడియో పోస్టు పెట్టాడు. ‘క్రీస్తు లేని ప్రపంచాన్ని సృష్టించే కుట్ర’ అనే టైటిల్‌తో ఈ వీడియోను పోస్టు చేశాడు. దీనిపై ఫేస్‌బుక్ సంస్థ హెచ్చరికలు చేస్తోంది. దీన్ని చూసే వాళ్లందరికీ కనిపించేలా ఈ వార్నింగులు పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement
Advertisement