Abn logo
Sep 30 2020 @ 05:11AM

ఖాళీలు... అక్రమాలు..!

Kaakateeya

 ఖాళీలపై దోబూచులాట.. 

అవస్థల్లో పలువురు టీచర్లు 

 జీతం ఒకచోట.. పని మరో చోట


అనంతపురం విద్య, సెప్టెంబరు 29 : పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని అధికారులకు రూ.లక్షలు కురిపిస్తున్నాయి. అధికారి కంగా అక్కడ ఖాళీ ఉందంటారు ఆప్షన్‌ ఇచ్చుకుని ఆ స్కూల్‌లో జాయిన్‌ కావడానికి వెళితే ఖాళీ లేదంటారు. ఇటీవల జరిగిన అప్‌గెడ్రేషన్‌ పోస్టుల ఖాళీలు చుట్టూ ఇలాంటి మాయే జరిగింది. ఓ అఽధికారి కాసుల కక్కుర్తే చాలా మంది ఉపాధ్యాయులకు ఆవేదన, కన్నీళ్లు మిగిల్చింది. ఉపాధ్యాయ ఖాళీలకు లక్షలు చేతులు మారు తుండటం వల్లే అర్హులకు అన్యాయం జరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 


అప్‌గ్రెడేషన్‌లో భారీగా తారుమారు !

 గత ఏడాది నవంబర్‌ మొదటి వారంలో భాషా పండితులు, పీఈటీలను స్కూల్‌ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్‌ చేశారు. అధికారులు చూసిన ఖాళీలకు ఆప్షన్‌ ఇచ్చిన టీచర్లు ఆర్డర్‌ కాపీ తీసుకుని ఆ పాఠశాలలో చేరేందుకు వెళితే ఖాళీలు తేవంటూ ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు వెనక్కు పంపారు. పలువురు తెలుగు, హిందీ స్కూల్‌ అసిస్టెంట్లకు ఇదే దుస్థితి. అధికారుల తప్పదం వల్ల అటు మంచి స్థానం దక్కకపోగా, ఇటు శాశ్వత స్థానం దూరమైంది. దీంతో ఉద్యోగం ఒక చోట చేస్తూ... జీతం మరోచోట తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాడిపత్రి ప్రాంతంలో పనిచేసే ఒక మహిళా టీచర్‌ డీ హీరేహాళ్‌లో జీతం డ్రా చేస్తున్నారు. ముదిగుబ్బ మండలంలో పనిచేసే మరో మహిళా టీచర్‌ కొత్త చెరువులో జీతం డ్రా చేయాల్సి వస్తోంది.


సర్వీసు మ్యాటర్స్‌, ఇతర పనులపై ఒకచోటకు, పని చేయడానికి మరోచోటకు వెళ్లాలంటే ఆ ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డీఈఓ కార్యాలయంలోని సీ-సెక్షన్‌ అధికారుల తప్పిదం వల్ల టీచర్లు సుమా రు 10 నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు. కాసుల కోసమే ఖాళీలు మాయం చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయ ఖాళీలతోపాటు డీఈఓ కార్యాలయంలో సీట్ల కేటాయింపులోనూ ఆ విభాగంలోని ఓ అధికారి ముడపులకు అలవాటుపడ్డారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వల్లే అప్‌గ్రెడేషన్‌ సమయంలో ఓ క్లర్కును బలి చేసి బదిలీ వేటు పడేలా చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement
Advertisement