Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 23 2021 @ 17:13PM

ఆ కూటమిలో భారత్, జపాన్‌ చేరబోవు

వాషింగ్టన్: అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలతో(AUKUS)కూడిన భద్రత కూటమిలో భారత్, జపాన్‌కు సభ్యత్వం కల్పించడం లేదని అగ్రరాజ్యం చెప్పింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ భద్రతా కారణాల రీత్యా AUKUS కూటమిని ఏర్పాటు చేస్తున్నామని సెప్టెంబరు 15న సంయుక్తంగా ప్రకటించారు. గత వారంలో ఏర్పాటయిన AUKUS కూటమి అనేది ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌కు పంపిన ధీటైన సమాధానమని బుధవారం వైట్‌హౌస్ మీడియా సెక్రెటరీ చెప్పారు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ సభ్యదేశాలుగా ఉన్న క్వాడ్ కూటమి సమావేశానికి వైట్‌హౌస్ ఈ నెల 24న అతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో క్వాడ్ సభ్యదేశాలు ఏమైనా ఈ కూటమిలో చేరుతాయా అని ఒక జర్నలిస్ట్ ప్రశ్నించగా ఇండో-పసిఫిక్ నుంచి ఎవరూ ఈ కూటమిలో చేరబోవని సమాధానమిచ్చారు. 


ఇండో-పసిఫిక్‌లో చైనా ప్రభావాన్ని తగ్గించడానికి AUKUS కూటమిని ఏర్పాటు చేశారు. కూటమి ఒప్పందంలో భాగంగా అమెరికా, బ్రిటన్ అణు జలాంతర్గాములను ఆస్ట్రేలియాకు సరఫరా చేయనుంది. కంగారు దేశం గతంలో ఫ్రాన్స్ నుంచి జలాంతర్గాములను కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ కూటమి ఏర్పాటుపై చైనా తన అక్కసును వెళ్లగక్కింది. కూటమికి భవిష్యత్తు లేదని చెప్పింది. AUKUS కూటమిని ఏర్పాటు చేయడం దారుణామని ఫ్రాన్స్ వివరించింది. కూటమి ప్రకటన రాగానే ఆస్ట్రేలియా, అమెరికాలో ఉన్న తమ దౌత్యవేత్తలను ఫ్రాన్స్ వెనక్కి పిలిపించింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement