Advertisement
Advertisement
Abn logo
Advertisement

మంచంపట్టిన యువతిపై అకృత్యానికి పాల్పడ్డ నర్సుకు జైలు శిక్ష!

ఇంటర్నెట్ డెస్క్: మంచంపట్టిన యువతిపై అఘాయిత్యానికి పాల్పడి ఆమెను తల్లిని చేసిన ఓ నర్సుకు అమెరికా కోర్టు గురువారం నాడు పదేళ్ల కారాగార శిక్ష విధించింది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. బాధిత యువతి కొన్నేళ్లుగా ఫీనిక్స్ నగరంలోని(అరిజోనా రాష్ట్రం) ఓ సంరక్షణా కేంద్రంలో వైద్యుల పర్యవేక్షణలో ఉంటోంది. అక్కడే నర్సుగా పని చేస్తున్న నేథన్ అమెపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘోరం మూడోకంటికి తెలీకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. బాధితురాలికి ప్రసవం అయ్యే వరకూ ఈ ఘోరం ఇతరులెవ్వరికీ తెలియలేదని స్థానిక మీడియా పేర్కొంది. నర్సు అకృత్యానికి ఫలితంగా బాధితురాలు 2019లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో.. సంరక్షణాలయం నిర్వహకులు ఒక్కసారిగా షాకయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ క్రమంలో పోలీసులు అక్కడున్న పురుష ఉద్యోగులందరికీ డీఎన్‌ఏ టెస్టులు చేయడంతో నేథన్ చేసిన అకృత్యం గురించి వెలుగులోకి వచ్చింది. తాను ఎటువంటి నేరం చేయలేదని తొలుత బుకాయించిన నిందితుడు పక్కా సాక్ష్యాధారాలు దొరికాక చేసిన నేరం ఒప్పుకున్నాడు. కాగా.. ఈ దారుణం బాధితురాలి కుటుంబంలో తీవ్ర విషాదం మిగిల్చింది. మంచానికే పరిమితమైన తమ కూతురికి ఒంట్లో ఎటువంటి చలనం ఉండదని తల్లిదండ్రులు వాపోయారు. చిన్నతనం నుంచి ఆమెకు మానసిక వైకల్యంతో సతమతమవుతోందన్న వారు ఆమెపై ఈ అకృత్యం జరడం దారుణమని కన్నీరుమున్నీరయ్యారు. 


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement