Abn logo
Dec 5 2020 @ 07:22AM

ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడానికి తాము ఆ పనికి సిద్ధం: యూఎస్ మాజీ అధ్యక్షులు

బహిరంగంగా వ్యాక్సిన్‌ వేయించుకుంటాం

ఒబామా, బుష్‌, బిల్‌ క్లింటన్‌, బైడెన్‌ ప్రకటన

వాషింగ్టన్‌, డిసెంబరు 4: కరోనా వ్యాక్సిన్‌ను బహిరంగంగా వేయించుకుని దాని గురించి ప్రజల్లో నమ్మకాన్ని నింపడానికితాము సిద్ధమని అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, జార్జి డబ్ల్యూ.బుష్‌, బిల్‌ క్లింటన్‌తో పాటు ఆ దేశ అధ్యక్ష పదవిని చేపట్టనున్న బైడెన్‌ చెప్పారు. బుష్‌, క్లింటన్‌ల తరఫున వారిప్రతినిధులు ఈ ప్రకటనలు చేశారు. ఏదైనా ఓ వ్యాక్సిన్‌ సురక్షితమేనని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆం టోనీ ఫౌసీ ప్రకటిస్తే దాన్ని వేయించుకుంటానని ఒబామా తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆమోదం పొందితే తానూ వ్యాక్సిన్‌ వేయించుకుంటానని జో బైడెన్‌ చెప్పారు. 

Advertisement
Advertisement
Advertisement