Oct 23 2021 @ 14:04PM

మహిళా నిర్మాత నాతో అసభ్యంగా ప్రవర్తించింది.. బాలీవుడ్ నటి సంచలన ఆరోపణలు!

ఓ మహిళా నిర్మాత తనతో అసభ్యంగా ప్రవర్తించిందని టీవీ నటి, బిగ్‌బాస్‌ ఓటీటీ ఫేం ఉర్ఫి జావేద్‌ సంచలన ఆరోపణలు చేసింది. బిగ్‌బాస్‌ ఓటీటీలో పాల్గొన్న ఆమె ఇటీవల ఎలిమినేట్‌ అయి బయటకు వచ్చింది.  అనంతరం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉర్ఫీ గతంలో ఓ వెబ్‌ సిరీస్‌ షూటింగ్ సమయంలో​ తానుఎదుర్కొన్న చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. ఆ వెబ్ సిరీస్‌ను నిర్మించిన మహిళా నిర్మాత తనతో అసభ్యంగా ప్రవర్తించిందని తెలిపింది. 


`చిన్నప్పటి నుంచి నటిని కావాలనే కొరిక ఉండేది. ఎన్నో కష్టాలు పడిన తర్వాతే అవకాశాలు రావడం ప్రారంభించాయి. ఓ వెబ్ సిరీస్‌లో ఛాన్స్ వచ్చింది. ఓ మహిళా నిర్మాత ఆ వెబ్‌ సిరీస్‌‌ను నిర్మిస్తోంది. మొదటి రోజు షూటింగ్‌కు వెళ్లగానే నాకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. మహిళా నిర్మాత సెట్‌‌లో అందరి ముందు నాతో అసభ్యంగా ప్రవర్తించింది. ఆ సిరీస్‌లో నాకు బావగా నటించిన వ్యక్తితో అసభ్యకర పనులు చేయించింది. షూట్‌ ప్రారంభించగానే అతడు నా కాళ్లను తాకుతూ పైకి వచ్చి నా చీరను తొలగించాలని ఆమె చెప్పింది. నిజానికి ఆ సీన్‌ స్క్రిప్ట్‌లో లేదు. దీంతో నేను ఆ సీన్‌ చేయనని చెప్పేశాను. దీంతో ఆగ్రహానికి గురైన నిర్మాత సెట్లో అందరి ముందు నా దుస్తులను చించేసింది. ఎంత వేడుకున్నా వినలేదు. నేను సంతకం చేసిన కాంట్రాక్ట్‌ పేపర్లు చూపించి కోర్టు వెళతానని బెదిరించింద`ని ఉర్ఫి చెప్పింది. 

Bollywoodమరిన్ని...