Abn logo
Jul 11 2020 @ 23:41PM

ఆఫ్గనిస్థాన్‌లో దాదాపు 70 శాతం మంది శాసనకర్తలకు కరోనా పాజిటివ్

కాబుల్: ఆఫ్గనిస్థాన్‌లో ఇప్పటివరకు 60 నుంచి 70 శాతం మంది శాసనకర్తలు కరోనా బారిన పడినట్టు ఆ దేశంలోని మీడియా సంస్థలు చెబుతున్నాయి. కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు అనేక మంది శాసనకర్తలు కరోనా బారిన పడ్డారని.. అయితే వారిలో చాలా మంది ఇప్పటికే పూర్తిగా కోలుకున్నట్టు ఎంపీ సిమిన్ బరెక్జాయ్ తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చి సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్న వారు కూడా త్వరంగా కోలువాలని తాను కోరుకుంటున్నట్టు సిమిన్ పేర్కొన్నారు. మరోపక్క కాబుల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి కూడా ఇదే విషయంపై స్పందించింది. గత రెండు, మూడు నెలల్లో అనేక మంది శాసనకర్తలు తమ ఆసుపత్రికి వచ్చి కరోనా పరీక్షలు చేయించుకున్నట్టు ఆసుపత్రి యాజమాన్యం మీడియాకు తెలిపింది. ఇందులో చాలా మంది కరోనా ఫలితాల్లో పాజిటివ్ అని తేలిందని చెప్పింది. కాగా.. ఆఫ్గనిస్థాన్‌లో ఇప్పటివరకు మొత్తంగా 34,366 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోపక్క కరోనా కారణంగా దేశంలో ఇప్పటివరకు 994 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో ఆఫ్గనిస్థాన్‌లో 172 మంది కరోనా బారిన పడ్డారు.

Advertisement
Advertisement
Advertisement