Abn logo
Jul 15 2020 @ 10:16AM

శుభకార్యాల్లో ఇంతకు మించి ఉండొద్దు.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు..

భోపాల్: కొవిడ్-19 కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మధ్య ప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహ కార్యక్రమాల్లో 20 మందికి మించి అనుమతి ఇవ్వరాదంటూ.. అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఫ్యామిలీ ఫంక్షన్లు, పుట్టిన రోజు వేడుకలు సహా ఇతర ఏ శుభకార్యాల్లోనూ 10 మందికి మించి సమావేశం కాకూడదని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనా కార్యక్రమాలపై నిషేధం విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రార్థనా స్థలాల్లో కూడా ఒకేసారి ఐదుగురికి మించి కూడుకోరాదంటూ ఆదేశించింది. 

Advertisement
Advertisement
Advertisement