Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 12 2021 @ 06:26AM

Thunderstorm పిడుగుపాటు: రాజస్థాన్‌లో 20 మంది, యూపీలో 18 మంది మృతి!

ఫిరోజాబాద్: Thunderstorm ఉత్తరప్రదేశ్‌లో భయంకరమైన పిడుగుపాట్లు సంభవించాయి. వివిధ ప్రాంతాల్లో పడిన పిడుగుల కారణంగా 18 మంది ప్రాణాలు కల్పోయారు. ఫిరోజాబాద్ జిల్లాలో బాగా ఎండ కాసిన తరువాత భారీ వర్షం పడింది. ఇదే సమయంలో పిడుగులు పడ్డాయి. ఫిరోజాబాద్ పరిధిలోని మూడు గ్రామాల్లో ముగ్గురు పిడుగుపాటుకు బలయ్యారు. నాగలా అమర్ గ్రామంలో ఇద్దరు రైతులు తమ పొలాల్లో వ్యవసాయ పనుల్లో ఉండగా భారీ వర్షం కురిసింది. దీంతో వీరిద్దరూ ఒక చెట్టు కింద నిలుచున్నారు. ఇంతో హఠాత్తుగా వారిపై పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందారు. మొత్తంగా యూపీలో పిడుగుపాట్లకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పిడుగు పాటుకు 42 గొర్రెలతో పాటు ఒక ఆవుకూడా మృతి చెందింది. ఇదేవిధంగా రాజస్థాన్‌లోని జైపూర్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో కూడా పిడుగుపాట్లు సంభవించి 20 మంది మృతి చెందారు.

Advertisement
Advertisement