Abn logo
Aug 8 2020 @ 20:40PM

యూపీలో కొత్తగా 4,660 కరోనా కేసులు నమోదు

లక్నో: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ యూపీలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం నాటికి అందిన సమాచారం మేరకు రాష్ట్రంలో కొత్తగా 4,660 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,18,038 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా వల్ల ఇవాళ 47 మంది మృతి చెందగా, మొత్తం 2,028 చనిపోయారు.


Advertisement
Advertisement
Advertisement