Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరోనా వ్యాక్సినకు ఇంకా 2.30 లక్షల మంది దూరం

టీకాపై తొలగని అపోహలు..!

వంద శాతం సాధనకు వైద్యశాఖ కుస్తీ

బహుమతులతో ఆకర్షించే యత్నం


కరోనా టీకాపై ప్రజల్లో ఇంకా అపోహలు తొలగట్లేదు. వైరస్‌ నివారణకు వ్యాక్సిన వేసుకోవడం ఒకటే మార్గమని వైద్యులు చెబుతూనే ఉన్నారు. అయినా.. జనం వ్యాక్సిన వేయించుకునేందుకు ఇంకా వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వంద శాతం టీకా లక్ష్యం అందుకునేందుకు యంత్రాంగం నానా అవస్థలు పడుతోంది. కొత్త దారులు వెతుకుతోంది. బహుమతులతో ఆకర్షించే దిశగా అడుగులు వేస్తోంది. టీకా వేసుకో.. బహుమతి తీసుకో.. అంటూ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.


అనంతపురం వైద్యం, డిసెంబరు2: జిల్లాలో వేలాదిమంది కరోనా బారిన పడ్డారు. అందులో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి నుంచి బయటపడడానికి కరోనా వ్యాక్సిన వచ్చింది. ప్రతిఒక్కరూ వ్యాక్సిన వేసుకోవాలని ఇదే శ్రీరామరక్ష అని పదేపదే చెబుతున్నారు. జిల్లాలో ఇప్పటికీ లక్షల మంది వ్యాక్సినకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో 32.36 లక్షల మంది 18 ఏళ్ల పైబడిన వారున్నారనీ, వీరందరికీ కరోనా వ్యాక్సిన వేయాలని లక్ష్యం పెట్టింది. జిల్లా యంత్రాంగం తాము సర్వే చేశామని ఆ ప్రకారం 18 ఏళ్ల పైబడినవారు 30,86,651 మంది ఉన్నట్లు చూపుతున్నారు. జిల్లా యంత్రాంగం చూపిన సంఖ్య మేరకు ఇప్పటివరకు 2855659 మందికి వ్యాక్సిన వేశారు. ఇంకా 2,30,992 మందికి వ్యాక్సిన వేయలేదని చూపుతున్నారు. అన్ని మండలాల్లో వేలల్లోనే వ్యాక్సిన ఒక్క డోసు కూడా వేయించుకోలేదు. అగళి మండలంలో 15886, ఆమడగూరు 210, అనంతపురం అర్బన, రూరల్‌ కలిపి 36060, ఆత్మకూరు 2986, బత్తలపల్లి 5386, బెలుగుప్ప 356, బొమ్మనహాళ్‌ 3371, బ్రహ్మసముద్రం 8657, బుక్కపట్నం 1391, బుక్కరాయసముద్రం 2773, సీకేపల్లి 3066, చిలమత్తూరు 4369, డీ హీరేహాళ్‌ 1614, ధర్మవరం 3500, గాండ్లపెంట 1666, గార్లదిన్నె 7093, గుత్తి 215, గోరంట్ల 12463, గుడిబండ 9778, గుమ్మఘట్ట 8081, గుంతకల్లు 3821, హిందూపురం 4103, కదిరి 1032, కళ్యాణదుర్గం 9260, కంబదూరు 10411, కనగానపల్లి 1334, కణేకల్లు 3566, కొత్తచెరువు 8597, కూడేరు 3822, కుందుర్పి 10749, లేపాక్షి 3030, మడకశిర 20854, ముదిగుబ్బ 9474, నల్లచెరువు 907, నల్లమాడ 2822, ఎనపికుంట 1751, నార్పల 7986, ఓడీ చెరువు 4243, పామిడి 1705, పరిగి 12989, పెద్దపప్పూరు 5715, పెద్దవడగూరు 2778, పెనుకొండ 7178, పుట్లూరు 1650, పుట్టపర్తి 3049, రామగిరి 2056, రాప్తాడు 7264, రాయదుర్గం 7237, రొద్దం 563, రొళ్ల 8906, శెట్టూరు 8224, శింగనమల 2922, సోమందేపల్లి 9482, తాడిమర్రి 2397, తాడిపత్రి 865, తలుపుల 829, తనకల్లు 4627, ఉరవకొండ 3443, వజ్రకరూరు 3012, విడపనకల్లు 3943, యాడికిలో 2627 మంది ఇంకా ఒక్క డోసు కూడా కరోనా వ్యాక్సిన వేయించుకోలేదని అధికారులు చూపుతున్నారు. వ్యాక్సినేషన ప్రారంభించి 10 నెలలు దాటింది. ఇంకా 2.30 లక్షల మంది ఒక డోసు టీకా కూడా వేయించుకోలేదంటే టీకా అంటే భయమా.. లేకపోతే అవగాహన కల్పించడంలో అధికారుల వైఫల్యమా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది అపోహల వల్లే టీకా వేయించుకోవడానికి ముందుకు రావడం లేదని  వైద్యాధికారులు చెబుతున్నారు. వ్యాక్సిన వేయించుకుంటే పిల్లలు పుట్టరనీ, గర్భం దాల్చరనీ, వీర్య కణాలు తగ్గిపోతాయని ఇతర వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని ఇలా అనేక అపోహలు ఉన్నాయి. దీంతో చాలామంది వ్యాక్సిన వేయించుకోవడానికి ఆసక్తి చూపడం లేదని వైద్యవర్గాలు చెబుతున్నాయి. కూలికెళ్లేగానీ పూటగడవని వారు టీకా వేయించుకుంటే జ్వరాలు వస్తాయనీ, నొప్పులు ఉంటాయని కూలికెళ్లడానికి కుదరదన్న అపోహలతో టీకాకు దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. వైద్యవర్గాలు ఈ అపోహలను తొలగించడంలో విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


బహుమతుల ఎర

జిల్లాలో వందశాతం కరోనా వ్యాక్సినేషన సాధనకు వైద్యశాఖ కుస్తీ పడుతోంది. ఇప్పటి వరకు టీకా వేయించుకోవడానికి ముందుకు రాని వారికి బహుమతుల ఎర వేస్తోంది. టీకా వేస్కో.. బహుమతి తీస్కో.. అనే కార్యక్రమం తీసుకొచ్చారు. జిల్లాలో పెనుకొండ, కళ్యాణదుర్గం డివిజన్ల పరిధిలో టీకా శాతం తక్కువగా నమోదైంది. అక్కడున్న 23 పీహెచసీల పరిధిలో ఈ బహుమతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈనెల 30వ తేదీ వరకు పెనుకొండ, కళ్యాణదుర్గం డివిజన్ల పరిధిలోని సోమందేపల్లి, గోరంట్ల, పరిగి, చిలమత్తూరు, లేపాక్షి, కేబీహళ్లి, కల్లుమర్రి, నీలకంఠాపురం, అగళి, రొళ్ళ, గుడిబండ, అమరాపురం, గుండుమల, ము ద్దినాయనపల్లి, బెలుగుప్ప, కంబదూరు, శెట్టూరు, కుందుర్పి, బ్రహ్మసముద్రం, గుమ్మఘట్ట, రాయదుర్గం పీహెచసీల్లో వ్యాక్సిన వేయించుకున్న వారికి కూపన ఇస్తారు. ఆ కూపనలో తమ వివరాలు నమోదు చేసి, అక్కడ ఏర్పాటు చేసిన డబ్బాలో వేయాలి. ఈనెల 31న లక్కీడ్రా తీస్తారు. మొదటి బహుమతి పొందిన ముగ్గురికి మిక్సర్‌ గ్రైండర్లు, రెండో బహుమతి పొందిన ఐదుగురికి ప్రెజర్‌ కుక్కర్లు, మూడో బహుమతి కింద 10 మందికి డిజిటల్‌ బీపీ ఆపరేటర్లు ఇవ్వనున్నట్లు జిల్లా వైద్యాధికారి కామేశ్వరప్రసాద్‌, డీఐఓ యుగంధర్‌ తెలిపారు.వ్యాక్సినే కరోనాకు విరుగుడు...: డాక్టర్‌ యుగంధర్‌, డీఐఓ

కరోనా నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే వ్యాక్సిన ఒక్కటే మార్గం. టీకాపై అపోహలు, భయాలు అవసరం లేదు. రెండు డోసులు తీసుకుంటేనే కరోనా సోకినా ప్రాణాలకు ముప్పు ఉండదు. వందశాతం వ్యాక్సినేషనకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. నెలాఖరులోగా స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన వేసేందుకు చర్యలు చేపట్టాం. ఇంటింటికీ వెళ్లి, వ్యాక్సిన వేయించుకోని వారిని గుర్తించి, టీకా వేస్తున్నాం. ఇందుకు ప్రజలు పూర్తిగా సహకరించాలి. కరోనా నుంచి బయటపడాలి. 

Advertisement
Advertisement