Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 23 2021 @ 08:30AM

Bengaluru:మహిళా ప్రయాణికురాలిపై ఉబెర్ డ్రైవర్ అత్యాచారం

బెంగళూరు : స్నేహితుడితో కలిసి పార్టీ చేసుకొని ఇంటికి తిరిగి వస్తున్న మహిళపై ఉబెర్ డ్రైవరు అత్యాచారం జరిపిన దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో తాజాగా వెలుగుచూసింది.జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవన్ బీమానగర్ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా నివాసముంటోంది. మహిళ తన స్నేహితుడి వద్ద పార్టీ చేసుకొని హెచ్‌ఎస్ఆర్ లేఅవుట్ ప్రాంతం నుంచి మురుగేశ్ పాళ్యానికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసింది. క్యాబ్ గమ్యస్థానానికి చేరుకోగానే ఉబెర్ డ్రైవరు కారు లాక్ చేసి, మహిళపై అత్యాచారం చేశాడు. అనంతరం మహిళను కారులో నుంచి బయటకు నెట్టాడు. 

అయితే బాధిత మహిళ క్యాబ్ డ్రైవరు ఫోన్ ను లాక్కుంది. అనంతరం క్యాబ్ డ్రైవరు భయపడి ఫోన్ తీసుకోకుండానే పారిపోయాడు. అనంతరం బాధిత మహిళ అత్యాచార ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేసి, నిందితుడి ఫోన్ ను పోలీసులకు ఇచ్చింది. నిందితుడైన ఉబెర్ క్యాబ్ డ్రైవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడని, అతన్ని ప్రశ్నిస్తున్నామని బెంగళూరు అదనపు పోలీసు కమిషనర్ మురుగన్ చెప్పారు. విచారణ ప్రారంభ దశలో ఉన్నందున డ్రైవరు పేరును దాచిపెట్టినట్లు పోలీసులు చెప్పారు. 

బాధిత మహిళను వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి పంపించారు. కర్ణాటక రాష్ట్రంలో బసవరాజ్ బొమ్మై సీఎం అయ్యాక మైసూరులో సామూహిత అత్యాచారం ఘటన జరిగింది. ఇది రెండో ఘటన కావడంతో ప్రతిపక్షాలు సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నాయి.కాగా అత్యాచారం ఆరోపణలను క్యాబ్ డ్రైవర్ ఖండించాడు. క్యాబ్ చార్జీ చెల్లింపు విషయంలో గొడవ జరిగిందని, తాను మహిళా ప్రయాణికురాలిని తాకలేదని చెప్పారు.  


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement