Abn logo
May 21 2020 @ 09:11AM

యూఏఈలో ఆగ‌ని క‌రోనా విజృంభణ‌..!

యూఏఈ:  ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న మ‌హమ్మారి క‌రోనా వైర‌స్.. అటు గ‌ల్ఫ్‌లో కూడా విజృంభిస్తోంది. ప్ర‌ధానంగా యూఏఈ, ఖ‌తార్‌, సౌదీ అరేబియా, కువైట్‌లో ఈ వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ఉంది. యూఏఈలో రోజురోజుకీ శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న కోవిడ్‌-19 వ‌ల్ల భారీ సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి. బుధ‌వారం యూఏఈలో 941 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఆ దేశంలో క‌రోనా బారిన ప‌డిన వారి సంఖ్య 26,004కి చేరింది. అలాగే 1,018 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.  దీంతో ఇప్ప‌టివ‌ర‌కు 11,809 మంది కోలుకున్నార‌ని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.


కాగా, బుధ‌‌వారం సంభ‌వించిన ఆరు మ‌ర‌ణాల‌తో క‌లిపి యూఏఈలో ఈ మ‌హ‌మ్మారి వ‌ల్ల మృతి చెందిన వారి సంఖ్య‌ 233 అయింది. మ‌రో 13,962 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక క‌రోనా క‌ట్ట‌డి కోసం ఇప్ప‌టికే క‌ఠిన చ‌ర్య‌లు చేప‌డుతున్న యూఏఈ... దేశ‌వ్యాప్తంగా కోవిడ్ టెస్టుల‌ను ముమ్మ‌రం చేసింది. దీనిలో భాగంగా దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే 1.5 మిలియ‌న్ మందికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. 


మ‌రోవైపు ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తి నియంత్రణ కోసం యూఏఈ క‌ర్ఫ్యూ విధించి ప్ర‌జ‌ల‌ను పూర్తిగా ఇళ్ల‌కు ప‌రిమితం చేసింది. అయినా ప్ర‌జ‌లు క్వారంటైన్ నిబంధ‌న‌లను బేఖాత‌రు చేస్తూ ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌స్తుండ‌డం ప‌ట్ల సీరియ‌స్‌గా ఉన్న యూఏఈ ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. ఇక‌పై హోం క్వారంటైన్ ఆంక్ష‌ల‌ను ఉల్లంఘిస్తే 50వేల దిర్హామ్స్(రూ.10,30,116) జ‌రిమానా విధిస్తామ‌ని ప్ర‌క‌టించింది. రెండోసారి కూడా ఇలాగే నిబంధ‌న‌లు ఉల్లంఘించి దొరికితే 6 నెల‌ల జైలు లేదా ల‌క్ష దిర్హామ్స్‌(రూ.20.60 ల‌క్ష‌లు) ఫైన్ వేస్తామ‌ని అధికారులు హెచ్చ‌రించారు. ‌     


Advertisement
Advertisement
Advertisement