Abn logo
May 22 2020 @ 09:22AM

యూఏఈలో శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న మ‌హ‌మ్మారి...

యూఏఈ: గ‌ల్ఫ్‌లో శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్.. సౌదీ అరేబియా, ఖ‌తార్‌, కువైట్‌, యూఏఈలో విజృంభిస్తోంది. గురువారం యూఏఈలో ఏకంగా 894 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 26,989 మంది ఈ వైర‌స్ బారిన ప‌డ్డార‌ని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. అలాగే 946 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో యూఏఈలో క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 12,755కి చేరింది. నిన్న సంభ‌వించిన నాలుగు మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు ఆ దేశంలో 237 మంది ఈ మ‌హ‌మ్మారికి బ‌ల‌య్యారు. మ‌రోవైపు కోవిడ్ క‌ట్ట‌డి కోసం దేశ‌వ్యాప్తంగా క‌రోనా టెస్టులు ముమ్మ‌రం చేసిన యూఏఈ ఇప్ప‌టికే 1.5 మిలియ‌న్‌కు పైగా మందికి టెస్టులు నిర్వ‌హించింది. గురువారం కూడా యూఏఈ ఆరోగ్య‌శాఖ అధికారులు 43,000 కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఇదిలాఉంటే...  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ వైర‌స్ బాధితులు 50 ల‌క్ష‌లు దాటిపోగా, మృతుల సంఖ్య 3.34 లక్ష‌లు ఉంది.    

Advertisement
Advertisement
Advertisement