ప్రస్తుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' షూటింగ్‌ను పూర్తి చేసే పనిలోఉన్న అఖిల్ అక్కినేని తదుపరి చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుంది. సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాను నలబై కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తారట. అఖిల్ సినిమా కోసం అంత బడ్జెట్‌ను పెట్టడం నిజంగా సాహసమని టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం మేరకు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాలో ఇద్దరు బడా స్టార్స్‌ను నటింప చేయడానికి ఒప్పించాడట. ఆ ఇద్దరు బడా స్టార్స్ ఎవరో కాదు.. ఒకరు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కాగా.. మరొకరు కోలీవుడ్ విలక్షణ నటుడు అరవిందస్వామి. మరి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ చిత్రాన్ని రూపొందిస్తారు.