Abn logo
Aug 3 2021 @ 22:07PM

బైక్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

క్షతగాత్రుడు బుజ్జయ్యను 108 వాహనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్న సిబ్బంది

బైక్‌ను ఢీకొన్న కారు

సంగం, ఆగస్టు 3: మండలంలోని తరుణవాయి క్రాస్‌ రోడ్డు వద్ద ముంబై రహదారిపై మంగళవారం బైక్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వివరాల మేరకు మండలంలోని కొరిమెర్ల గ్రామానికి చెందిన బుజ్జయ్య, మరో వ్యక్తి ఖాజాతో కలిసి మోటారు బైక్‌పై పురుగుల మందు కొనుగోలు చేసేందుకు బుచ్చికి బయలుదేరారు. తరుణవాయి క్రాస్‌ రోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న కారు బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో కిందపడ్డ బుజ్జయ్యకు తీవ్ర, ఖాజాకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు బాధితులను 108 వాహనంలో వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.