పూణే (మహారాష్ట్ర) : ఓ కంటెయినర్ ట్రక్ బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి పలు వాహనాలను ఢీకొనడంతో ఇద్దరు మరణించగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడిన ఘటన మహారాష్ట్రలోని పూణే నగరంలో జరిగింది. పూణేలోని నవాలీ బ్రిడ్జి వద్ద కట్రాజ్ రోడ్డుపై ఆదివారం రాత్రి కంటెయినర్ ట్రక్ అదుపు తప్పి పలు వాహనాలను ఢీకొని బీభత్సం సృష్టించింది. ట్రక్ నాలుగు కార్లు, రెండు ద్విచక్రవాహనాలు, ఆటో రిక్షాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వచ్చి ట్రక్ డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు.