Abn logo
Aug 7 2020 @ 00:20AM

నిధులు..నిర్వాసితులు

పీఆర్‌ఎల్‌ఐకి ప్రధాన అవరోధంగా మారిన రెండు సమస్యలు


నాగర్‌కర్నూల్‌ (ఆంధ్రజ్యోతి) : దక్షిణ తెలంగాణలో 12.30 లక్షల ఎ కరాలకు సాగునీరందించాలనే బృహత్తర లక్ష్యంతో ఐదేళ్ల క్రితం ప్రారంభించిన పాల మూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐ) చుట్టూ వివాదాలు ముసురు కుంటున్నాయి. పథకం అస్థిత్వాన్ని దెబ్బతీసే విధంగా రీడిజైన్లు చేస్తున్నారంటూ ప్ర తిపక్షాలు, ప్రాజెక్టుల నిర్మాణంలో తమ చిత్తశుద్ధిని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు లేదని అధికార పక్షం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నీ ళ్లు.. నిర్వాసితుల సమస్య కూడా పనుల పురోగతికి ప్రధాన ఆటంకంగా మారిందనే విషయం స్పష్టమవుతోంది.


పీఆర్‌ఎల్‌ఐకి నిధుల లేమి అసలు సమస్యగా మారింది. ఐదేళ్ల కిందటే పథకాన్ని ప్రారంభించగా, మూడేళ్ల కిందటే పనులు పూర్తి చేయాల్సి ఉంది. దాదాపు రూ.65 వేల కోట్లు ఖర్చు అయ్యే ఈ ప్రాజెక్టులో, నిధుల ఖర్చు పది శాతం కూడా మిం చలేదు. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.10 వేల కోట్ల రుణ ఒప్పందం జరిగి నా, ఎలక్ర్టో మెకానికల్‌ పనులకు మాత్రమే ఈ నిధులను ఖర్చు చేయాలని షరత్తు విధించడంతో రిజర్వాయర్ల నిర్మాణం, కాలువల తవ్వకం, సివిల్‌ పనులపై ప్రభావం పడింది. అలాగే నిర్వాసితుల సమస్య కూడా తోడు కావడంతో భూ సేకరణ కష్టత రంగా మారింది. పథకానికి దాదాపు 14 వేల ఎకరాల భూ సేకరణ జరగాల్సి ఉండ గా, నాలుగు వేల ఎకరాల భూసేకరణ మిగిలే ఉంది. మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐ)లో ఒక సారి నిర్వాసితులుగా మారిన బాధితులు, పీఆర్‌ఎల్‌ఐతో రెండో దఫా కూడా భూములు కోల్పోవాల్సి వస్తుండడంతో కుడికిళ్లలో భూ సేకరణ కు ప్రధాన అవరోధంగా మారింది.


కేఎల్‌ఐ ద్వారా సాగునీరందుతుండడంతో పంట లు పుష్కలంగా పండుతున్నాయి. ఎకరా ధర రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వర కు పలుకుతోంది. ప్రభుత్వం ఇస్తున్న పరిహారం బయట ఉన్న డిమాండకనుగుణం గా లేకపోవడంతో రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. కు డికిళ్లలో రెండు సార్లు భూసేకరణ కోసం పోలీసులను ప్రయోగించినా నిర్వాసితులు ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారే తప్పా, భూ ములివ్వడానికి ససేమిరా అంటున్నారు.


నేడు మంత్రుల పర్యటన

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో చేపట్టిన పీఆర్‌ఎల్‌ఐ పనులను శుక్రవారం మంత్రులు, ఉన్నత స్థాయి అధికారుల బృందం పరిశీలించనుంది. ఇటీవల అధికా ర, ప్రతిపక్షాల మధ్య రీడిజైన్లపై విమర్శలు ప్రతి విమర్శలు చోటు చేసు కుంటు న్న నేపథ్యంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్‌, ఇరిగేషన్‌ శా ఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌, ఈఎంసీ మురళీధర్‌రావు పనుల పరిశీలన కు ఇక్కడికి రానుండటం ప్రాధాన్యతను సంతరించకున్నది. 

Advertisement
Advertisement