Abn logo
Jul 31 2021 @ 01:00AM

వేర్వేరుచోట్ల విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

శ్రీధరఘట్టలో మృతి చెందిన రైతు ఖాజాపీరా, గుత్తికి చెందిన వెంకటేష్‌ (ఫైల్‌)

బొమ్మనహాళ్‌/ గుత్తి, జూలై 30: బొమ్మనహాళ్‌, గుత్తి లో శుక్రవారం వి ద్యుదాఘాతంతో ఇద్ద రు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలివి. బొమ్మన హాళ్‌ మండలం శ్రీధరఘట్ట గ్రామానికి చెందిన రైతు ఖాజాపీరా (52) తన పది ఎకరాల పొలంలో వరిసాగు చే స్తున్నాడు. నారు పోసేందుకు బోరుమోటారును ఆన చేయడానికి వెళ్లగా విద్యుత షాక్‌కు గురై అక్కడిక్కడే మృతి చెందాడు.. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఇంటి పెద్దదిక్కు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. బాధిత రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. గుత్తి పట్టణంలోని కోటవీఽధి నాగులబావి కాలనీకి చెందిన యువకుడు వెంకటేష్‌ (20) ఇంటి నిర్మాణానికి సంబంధించి వెల్డింగ్‌ వర్క్‌ చేస్తుండే వాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుతషాక్‌ తగిలి కుప్పకూలిపోయాడు. గమనించిన వర్కర్లు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.