Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో కీలక మలుపు

అమరావతి: కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో కీలక మలుపు చోటుచేసుకుంది. కౌన్సిల్ హాల్‌లో జరిగిన రభస అనంతరం తమకు రక్షణ లేదని టీడీపీ కౌన్సిలర్లు పేర్కొన్నారు. తమను మున్సిపల్ భవనంలోనే ఈ రాత్రికి ఉండేందుకు అనుమతివ్వాలని కౌన్సిలర్లు అధికారులను కోరారు. రిటర్నింగ్ అధికారికి ఎంపీ కేశినేని నాని, టీడీపీ కౌన్సిలర్లు  లేఖ ఇచ్చారు. ఎంపీ నాని ఓటు హక్కుపై కోర్టులో కేసు సాగుతుండటంతో.. ఎన్నికను రేపటికి ఎన్నికల అధికారి వాయిదా వేశారు. కొండపల్లి పురపాలక సంఘం ఎన్నిక ఉత్కంఠ విడలేదు. పురపాలక సంఘం కార్యాలయంలోనే టీడీపీ వార్డు సభ్యుల నిరసనకు దిగారు.


కోరం ఉనప్పటికీ ఎన్నికను ఇంచార్జ్‌ కమిషనర్ వాయిదా వేశారు. వాయిదాకి గల కారణాలు లిఖితపూర్వకంగా ఇవ్వాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. టీడీపీ సభ్యుల ప్రతిపాధనను ఎన్నికల అధికారి నిరాకరించారు. ఎన్నిక సందర్భంగా జరిగిన పరిణామాలను వివరిస్తూ టీడీపీ సభ్యులు ఎన్నికల అధికారికి లేఖ రాశారు. వైసీపీ వార్డు మెంబర్స్ రౌడీల్లా వ్యవహరించి హాల్లో ఫర్నిచర్, సామగ్రిని ధ్వసం చేశారని చెబుతున్నారు. తాము ఇక్కడ నుంచి వెళ్లే ప్రసక్తేలేదలేదని టీడీపీ సభ్యులు తెగేసి చెబుతున్నారు. తమకు ప్రాణహాని ఉందని వాపోతున్నారు. ఎన్నికపై స్పష్టత వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని టీడీపీ సభ్యులు భీష్మించుకు కూర్చున్నారు.

Advertisement
Advertisement