Abn logo
May 21 2020 @ 08:16AM

కరోనాపై టర్కీ విజయ ర‌హ‌స్య‌మిదే !

టర్కీ ‘ట్రేసింగ్‌’ వ్యూహం

ఇస్తాంబుల్‌, మే 20: కరోనా వైరస్‌ విషపు కోరల్లో చిక్కి విలవిల్లాడిన దేశాల్లో టర్కీ కూడా ఒకటి. 8.4 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో 1.5 లక్షల మందికిపైగా కరోనా మహమ్మారి బారినపడ్డారు. 4,199 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్‌-19 ప్రభావిత టాప్‌-10 దేశాల్లో టర్కీది తొమ్మిదో స్థానంలో ఉందంటేనే ఇక్కడ వైరస్‌ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడిక్కడ కొత్త కేసులు నమోదవడం లేదు. ఇదంతా ఎలా సాధ్యమైందంటే ‘ట్రేసింగ్‌’తోనే అంటున్నారు అక్కడి వైద్య సిబ్బంది.  ఒక వ్యక్తికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చిన వెంటనే ‘ట్రేసర్లు’ (వైద్యసిబ్బంది) రంగంలోకి దిగిపోతారు. పాజిటివ్‌ వ్యక్తికి సన్నిహితులెవరో గుర్తించి.. యాప్‌ల ద్వారా వారిని పర్యవేక్షిస్తారు. వారి కాంటాక్ట్‌లపైనా కన్నేసి ఉంచుతారు. ఎవరిలోనైనా అనుమానిత లక్షణాలుంటే క్వారంటైన్‌కు తరలిస్తారు.

Advertisement
Advertisement
Advertisement