Abn logo
Sep 21 2021 @ 23:38PM

సిద్ధాంతాలతో గుర్తింపు పొందిన తులసీదాస్‌

మాట్లాడుతున్న తమ్మినేని సీతారాం


స్పీకర్‌ తమ్మినేని సీతారాం 

మందస: తాను నమ్మిన సిద్ధాంతాలతో దేశంలోనే ఉత్తమ వ్యక్తిగా మజ్జి తులసీ దాస్‌ గుర్తింపు పొందారని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు. మంగళవారం  మం దసలో పీసీసీ మాజీ అధ్యక్షుడు మజ్జి తులసీదాస్‌ సంస్మరణ సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రజల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ముం దుండేవారన్నారు.మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ఆనాడు కళింగదళ్‌, డబార్‌సింగి రిజర్వాయర్ల నిర్మాణం కోసం  కృషి చేశార న్నారు.  డాక్టర్‌ జీవితేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, డీసీసీ బొడ్డేపల్లి సత్యవతి, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌, కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌, పలాస మునిసపాలిటీ చైర్మన్‌ బల్ల గిరిబాబు, మాజీ చైర్మన్‌ వజ్జ బాబూరావు పాల్గొన్నారు.