Abn logo
Jun 13 2021 @ 02:57AM

మాట తప్పిన ముఖ్యమంత్రి జగన్‌: తులసిరెడ్డి

వేంపల్లె, జూన్‌ 12: ‘‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సీఎం జగన్‌ మాట తప్పడం, మడమ తిప్పడం శోచనీయం. జగన్‌ మాటలు నమ్మి ఉద్యోగులు ఓట్లేసి గెలిపించారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను మరచిపోయారు. ఏరుదాటే వరకు ఓడ మల్లన్న- దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న చందంగా వ్యవహరిస్తున్నారు’’అని కాంగ్రెస్‌ రాష్ట్ర కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరె డ్డి విమర్శించారు. ఈ మేరకు తులసిరెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.