Abn logo
Sep 22 2021 @ 03:25AM

వెనుకబడిన ప్రాంతాలవారికి శ్రీవారి దర్శనం

బస్సుల్లో ఉచితంగా తీసుకువచ్చేలా ప్రణాళిక 

7 నుంచి  వార్షిక బ్రహ్మోత్సవాలు : టీటీడీ ఈవో


తిరుమల, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): టీటీడీ ఇటీవల ఆలయాలు నిర్మించిన జిల్లాల నుంచి సుమారు వెయ్యి మంది భక్తులను ఉచితంగా బస్సుల్లో తిరుమలకు తీసుకువచ్చి శ్రీవారి దర్శనం చేయించడంపై విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ కొవిడ్‌ నేపథ్యంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను అక్టోబరు 7 నుంచి 15 వరకు ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అదనపు ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. 6న అంకురార్పణ, 7న ధ్వజారోహణం, 11న గరుడ వాహన సేవ జరుగుతాయన్నారు.