Abn logo
Jun 4 2020 @ 09:56AM

శ్రీవారి దర్శనాల పునరుద్దరణపై కాసేపట్లో ఉన్నతాధికారుల సమావేశం..!

 తిరుమల : శ్రీవారి దర్శనాల విషయమై ఉన్నతాధికారులు మరికాసేపట్లో సమావేశం కానున్నారు. స్వామి వారి దర్శన విషయంలో భక్తులకు ఇచ్చే సూచనలతో పాటు.. అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు.


కాగా... తొలి దశలో స్వామి వారిని దర్శనాలలో శఠారి, తీర్ధం తాత్కాలికంగా నిలిపివేసే యోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. తిరుమల దర్శనీయ ప్రదేశాల సందర్శనను కూడా రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక భక్తులు స్వామి వారికి సమర్పించే కానుకల విషయంలో కూడా పలు నిబంధనలను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. హుండీని తాకకుండా కానుకలను అందులో సమర్పించేలా చర్యలు తీసుకోనుంది. 


అంతేకాదు... ఆలయ పరిసర ప్రాంతాల్లో వస్తువులను భక్తులు తాకకుండా టీటీడీ చర్యలు తీసుకోనుంది. ఇక వకులా మాతా దర్శనంతో పాటు.. లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనాలను కూడా నిలిపివేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది

Advertisement
Advertisement
Advertisement