Abn logo
Jan 20 2021 @ 23:37PM

పీఆర్సీ నివేదికను బయటపెట్టాలి

  • టీఎస్‌యుటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య 

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని, బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ వెంటనే విడుదల చేయాలని టీఎ్‌సయుటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. టీఎ్‌సయుటీఎఫ్‌ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని దోమలగూడలోని రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బదిలీలు, పదోన్నతులపై అధికారుల హడావిడి తప్ప షెడ్యూల్‌ విడుదల చేయడం లేదని ఆరోపించారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గాలయ్య, జిల్లా అధ్యక్షుడు శ్రీరాములయ్య, ప్రధాన కార్యదర్శి వెంకటప్ప, ఉపాధ్యక్షులు ఎన్‌.కల్పన, కోశాధికారి కె. విజయభాస్కర్‌రెడ్డి, కార్యదర్శులు నాగేంద్రం, రఘుపాల్‌ కిషన్‌చౌహాన్‌, భీమ్‌రెడ్డి, భగవంతు, రాజ్‌, శ్రీశైలం, శివారెడ్డి, నరసింహులు, రామకృష్ణ, శ్రీనివాస్‌, దామోదర్‌  తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement