Abn logo
May 22 2020 @ 08:20AM

'నిద్రమొహం జోయ్ బిడెన్‌ను గెలిపించేందుకే చైనా తప్పుడు ప్రచారాలు'

ఆ నిద్రమొహం బిడెన్‌ను గెలిపించేందుకే

అమెరికాను దోచేయాలనుకుంటున్నారు

నేనొచ్చేవరకూ  అదే జరిగింది: ట్రంప్‌ 

వాషింగ్టన్‌, మే 21: కరోనా వైరస్‌ విషయంలో చైనా భారీ తప్పుడు ప్రచారాలకు తెర తీసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. ‘ఆ నిద్రమొహం జోయ్‌ బిడెన్‌ను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిపించేందుకే చైనా ఇవన్నీ చేస్తోంది. తద్వారా అమెరికాను దోచేయొచ్చని చైనా భావిస్తోంది. దశాబ్దాలుగా అదే జరిగింది. నేనొచ్చే వరకూ ఆ దోపిడీ కొనసాగింది’ అని ట్రంప్‌ గురువారం ట్వీట్‌ చేశారు. చైనా అసమర్ధత వల్లే ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది చనిపోతున్నారని ధ్వజమెత్తారు. ‘చైనా అధికార ప్రతినిధి చాలా తెలివితక్కువగా మాట్లాడారు. ఆ దేశం నుంచి ప్రపంచమంతా వ్యాపించిన వైరస్‌ సృష్టిస్తున్న మారణ హోమం, కష్టాలతో తమకేమీ సంబంధం లేదన్నట్టు మాట్లాడారు’ అని అన్నారు. చైనావి దోపిడీ ఆర్థిక విధానాలని,  అక్కడ మానవహక్కుల ఉల్లంఘనలూ కొనసాగుతున్నాయని తాజా నివేదికలో వైట్‌హౌస్‌ ఆరోపించింది.

Advertisement
Advertisement
Advertisement