Abn logo
Jan 21 2021 @ 00:40AM

నేడు ట్రక్కుల పంపిణీ

తాత్కాలికంగా ట్రాఫిక్‌ మళ్లింపు

గుజరాతీపేట, జనవరి 20: శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడి యంలో రేషన్‌ సరుకుల ట్రక్కుల వాహనాలను గురువారం పం పిణీ చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్‌ నివాస్‌, ఎస్పీ అమిత్‌బర్దర్‌, జేసీ సుమిత్‌కుమార్‌ బుధవారం పరి శీలించారు. గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాహనాల పంపిణీ ఉంటుందని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు కొత్తబ్రిడ్జి, కిమ్స్‌ రోడ్డులో ట్రాఫిక్‌ను తాత్కాలికంగా మళ్లిం చేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. విశాఖపట్నం, విజయ నగరం, రాజాం, బొబ్బిలి, సాలూరు, తదితర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను కుశాలపురం బైపాసు నుంచి లక్ష్మీటాకీస్‌, ఏడురోడ్ల కూడలి మీదుగా వయా డేఅండ్‌నైట్‌ జంక్షన్‌కు చేరుకునే విధంగా చర్యలు చేపడుతున్నారు. తిరిగి ఈ వాహనాలు డేఅండ్‌నైట్‌ జంక్షన్‌ నుంచి బయలుదేరి సింహద్వారం మీదుగా వెళ్లనున్నాయి. అలాగే ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం, నరసన్నపేట, బత్తిలి, కొత్తూరు, ఆమదాలవలస వైపు నుంచి వచ్చే బస్సులు సింహద్వారం మీదుగా డేఅండ్‌నైట్‌ జంక్షన్‌కు చేరుకోనున్నాయి. తిరిగి ఏడురోడ్లజంక్షన్‌, లక్ష్మీటాకీసు, కుశాలపురం బైపాస్‌ జంక్షన్‌ మీదుగా వెళ్లేలా చర్యలు చేపడుతున్నారు.  


Advertisement
Advertisement
Advertisement