Advertisement
Advertisement
Abn logo
Advertisement

పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే: kadiyam

హైదరాబాద్: రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన టీఆర్ఎస్ మహాధర్నాలో కడియం పాల్గొని ప్రసంగించారు. ఆకలితో అలమటించే తెలంగాణ అన్నపూర్ణగా ఎదిగిందని... దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరిందన్నారు. కేంద్రం చర్యలు రైతులకు నష్టం చేసేలా ఉన్నాయని తెలిపారు. కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకుంటోందని విమర్శించారు. వారి తప్పును రాష్ట్రాల మీదకు నెట్టేస్తున్నారన్నారు. బీజేపీ నేతలు బాధ్యతతో మాట్లాడాలని... బద్మాష్ మాటలు వద్దని హితవుపలికారు. బీజేపీ నేతలు బేకూఫ్ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశంలో రైతుల కోసం కేసీఆర్ ముందుకు నడవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో రైతుల పట్ల కేసీఆర్‌కు ఉన్న అవగాహన మరెవరికీ లేదని కడియం శ్రీహరి పేర్కొన్నారు. 

Advertisement
Advertisement