Advertisement
Advertisement
Abn logo
Advertisement

పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టీఆర్ఎస్

ఢిల్లీ: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరుకు నిరసనగా పార్లమెంట్ సమావేశాలను టీఆర్ఎస్ బహిష్కరించింది.  వారం రోజులుగా పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ ఆందోళనలు కేంద్రం పట్టించుకోకపోవడంతో పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎంపీలు ప్రకటించారు. తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని ఎంపీలు తెలిపారు. 


 

ఈ సందర్భంగా పార్టీ పార్లమెంటరీ నాయకుడు ఎంపీ కె.కేశవరావు మాట్లాడుతూ సభను బాయ్‌కాట్ చేయడం బాధకలిగించే విషయమన్నారు. కేంద్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు. తెలంగాణ నుంచి బాయిల్డ్‌ రైస్ కొనబోమని కేంద్రం చెబుతోందన్నారు. రబీలో పూర్తిగా ఉప్పుడు బియ్యం మాత్రమే వస్తుందన్నారు. అందుకే రబీ ధాన్యం బాయిల్డ్‌రైస్‌గా మారుస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎఫ్‌సీఐ నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. యార్డుల్లో ఉన్న ధాన్యాన్ని ఎఫ్‌సీఐ తరలించకపోవడంతో ధాన్యం పాడైపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తదుపరి కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని ఎంపీ కేకే పేర్కొన్నారు. 


Advertisement
Advertisement