Abn logo
Sep 25 2021 @ 02:26AM

ట్రిపుల్‌ ఐటీ పరీక్షలు పక్కాగా నిర్వహించాలి: డీఈవో

సమావేశంలో ప్రసంగిస్తున్న పురుషోత్తం

చిత్తూరు (సెంట్రల్‌), సెప్టెంబరు 24: జిల్లాలో ఆదివారం జరగనున్న ట్రిపుట్‌ ఐటీ పరీక్షలు పక్కాగా నిర్వహించాలని డీఈవో పురుషోత్తం అన్నారు. శుక్రవారం తన సమావేశ మందిరంలో చీఫ్‌ సూపరింటెండెంట్లతో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ పరీక్షలకు 5,802 మంది విద్యార్థులు హాజరు కానుండగా, వీరికోసం 42 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 248 మంది ఇన్విజిలేటర్లు, 42 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లను నియమించినట్లు చెప్పారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. కొవిడ్‌ నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహిస్తున్న వివరించారు. పరీక్షల సహాయ కమిషనర్‌ ప్రభావతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.